కేసీఆర్‌కు పోయేకాలం వచ్చింది --: ఈటెల రాజేందర్..

 


వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని బిజెపి సీనియర్ నాయకుడు  ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.తెలంగాణ సంపదకు ప్రజలు యజమానులు కేసీఆర్ కాదని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశారని ఈటల ప్రశ్నించారు.రాష్ట్రంలోని రైతులు, ప్రమాదంలో చనిపోయినవారిపై లేని ప్రేమపంజాబ్ రైతులపై ఎందుకు?అని అన్నారు.సీఎస్, కలెక్టర్లు మద్యంను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు.కేసీఆర్‌కు పోయేకాలం వచ్చినందుకే పీకే అవసరం వచ్చిందని ఈటల వ్యాఖ్యానించారు.