భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. జులై 2 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ నిర్వహించి, 21న ఫలితాలను విడుదల చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది. పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. వీళ్లదరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉంటుంది.