తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.ప్రభుత్వ వైద్యులు ప్రవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం.

 తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యులు ప్రవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఇందుకోసం మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది. ఈ మేరకు వైద్యారోగ్య ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ బ్యాన్ చేసింది. ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్లకు ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్యులు విధులుకు ఆలస్యంగా రావడం.. శ్రద్ధగా పని చేయకపోవడం, దీర్ఘకాలంపాటు సెలవులు పెడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పేద ప్రజలకు మేలైన వైద్యం అందించడానికే ఈ రూల్ తీసుకొచ్చామని తెలంగాణ DH శ్రీనివాసరావు తెలిపారు.