పవన్ కల్యాణ్ ,రాజమౌళి కాంబో లో సినీమా సెట్..?

 


దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్ మాత్రమే కాదు నెంబర్ 1 హీరోల కంటే కూడా ఎక్కువ మార్కెట్ ఉన్న దర్శకుడు. ఇప్పటివరకు ఇతని డైరెక్షన్లో సినిమాలు చేయడం వల్లనే స్టార్ హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టార్ డంని ఈయన మళ్ళీ వాడుకున్నాడు అనుకోండి. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ వంటి వారు ఈ లిస్ట్ లోకి వస్తారు. అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు రాజమౌళితో సినిమాలు చేయకుండానే నెంబర్ వన్ రేసింగ్లో ఉన్నారు. 

వీళ్ళతో ఇప్పటివరకు రాజమౌళి సినిమాలు చేయలేదు. ఈ కాంబోలో సినిమాలు వస్తే చూడాలని అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచుస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఫిక్స్ అయ్యింది. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లే..! ఎక్కువగా పవన్- రాజమౌళి కాంబినేషన్ కోసం అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్ళ కాంబోలో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరకడం కష్టం.
 

అయితే పవన్ కళ్యాణ్ కోసం రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఓ కథని రెడీ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాసుకున్నట్టు ఆయన గతంలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘విక్రమార్కుడు’ కథని కూడా పవన్ కళ్యాణ్ కోసమే రెడీ చేసుకున్నట్టు విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు తన వద్ద పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ను వేరే దర్శకుడికి ఇచ్చే ఉద్దేశం లేదని తెలిపాడు. ఎప్పటికైనా ఆ కథని రాజమౌళి… పవన్ కళ్యాణ్ తో చేయాల్సిందేనని పట్టుబట్టి కూర్చుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!