న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’ నానికి జోడీగా నజ్రీయా ఫహద్ నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో.. ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.
‘‘సుందర్ ప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అంటే సుందరానికి టీమ్ చాలా థ్రిల్ అవుతోంది. థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ సర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు హీరో నాని. ఈ ఈవెంట్‌ను ముందుగా ఈనెల 8న నిర్వహించాలని ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రావడంతో డేట్ మారింది. అయితే పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వస్తుండటంతో ‘అంటే సుందరానికీ’ సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగింది. అందరి దృష్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పడింది.