తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ పునఃప్రారంభం..

 


 రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు  పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి.



దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేశారు.


కాగా, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించనున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తగతి వరకు ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1.04 లక్షల మంది ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిచ్చింది.


కరోనాతో గత రెండేండ్లుగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. 2020 సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. కరోనా రెండో వేవ్‌ నేపథ్యంలో 2021లో జూలైలో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించి, సెప్టెంబర్‌ 1 నుంచి ముఖాముఖి తరగతులు కొనసాగించారు. రెండేండ్ల విరామం తర్వాత అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిన పడింది. ప్రతీ సంవత్సరంలాగే 2022 -23 విద్యా సంవత్సరం జూన్‌ రెండో వారంలో మొదలవుతున్నది.