బాలకృష్ణకు విలన్ గా అంజలి..?

 


నటసింహం బాలకృష్ణ  హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అటు అఖండతో బాలకృష్ణ, ఇటు ఎఫ్‌3తో అనిల్‌ రావిపూడి భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న ఈ సినిమాలో రవితేజ కూడా నటించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఇందులో బాలకృష్ణ కూతురిగా పెళ్లిసందD ఫేమ్‌ శ్రీలీల నటిస్తోంది.


జులై నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో కొత్త న్యూస్‌ వైరల్‌ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోందని తెలుస్తోంది. అయితే అంజలి హీరోయిన్‌గా కాకుండా విలన్‌ పాత్రలో నటించనుందని సమాచారం. బాలయ్యలాంటి పవర్‌ ఫుల్‌ హీరోను ఢీకొట్టే రేంజ్‌లో అంజలి క్యారెక్టర్‌ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.