మరోసారి వి.వి వినాయక్ చిరంజీవి కాంబో..?.

 


మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఈయన లైనప్ ఇంత వేగంగా ఉంటుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ మెగాస్టార్ మాత్రం అద్భుతమైన మాస్ లైనప్ తో కుర్ర హీరోలకు పోటీగా దూసుకు పోతున్నాడు.



ఇప్పటికే ఈయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయినా కూడా మెగాస్టార్ ఇంకా కథలు వింటూ డైరెక్టర్ లను క్యూ లో ఉంచుకుంటున్నాడు.


అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. అయినా కూడా ఈయన చేస్తున్న సినిమాలపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.


అలాగే ఈయన లైనప్ లో మరో డైరెక్టర్ ఉన్నారు.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ ఇన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరొక డైరెక్టర్ కు ఓకే చెప్పాడట.


వెంకీ కుడుముల తో ఒక సినిమా చర్చల దశలో ఉండగానే వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఠాగూర్, ఖైదీ నెం.150 సినిమాలు రాగా అవి రెండు కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో వినాయక్ కు మెగాస్టార్ కు మధ్య మంచి స్నేహబంధం ఉంది. మరి వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

ప్రెసెంట్ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ఏడాదిలో చిరంజీవి సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట..