యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకినట్లు వచ్చిన వార్తలు కల కలం రేపాయి. బిహార్‌కు చెందిన సదరు చిన్నారి కుటుంబం, ఆమె చెవి సమస్యకు చికిత్స కోసం ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వచ్చారు. లక్షణాలను బట్టి మంకీపాక్స్‌గా అను మానించి, నమూనాలను పుణెలోని వైరాలజీ జాతీయ సంస్థ (ఎన్ఐవీ)కి పంపించామని స్థానిక వైద్యులు తెలిపారు. చిన్నారికి ఒళ్లంతా పొక్కులతో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ.. అది మంకీపాక్స్ అని కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొన్నారు. కాగా.. చిన్నారిది మంకీపాక్స్ కేసు కాదని ఘజియాబాద్ ముఖ్య వైద్యాధికారి భవతేశ్ శంఖధర్ చెప్పారు. మామి డిపళ్లు ఎక్కువగా తినడం వల్ల వచ్చిన వేడి పొక్కులేనని, కంగారుపడాల్సి అవసరం లేదని భరోసా ఇచ్చారు.