జూబ్లీహిల్స్ ఆమ్నిషియా పబ్‌ రేప్ కేసు ఇన్విస్టిగేషన్లో బయటకు వచ్చిన సంచలన నిజాలు..

 


జూబ్లీహిల్స్ ఆమ్నిషియా పబ్‌ రేప్ కేసులో కీలక సమాచారల దిశగా పోలీసుల ఇన్విస్టిగేషన్ ఊపందుకుంది.మైనర్ గర్ల్ ని ట్రాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేసి విచారించగా.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటికొచ్చాయి. బాలికని మొదట ట్రాప్ చేసింది కార్పొరేటర్‌ కుమారుడే అని ఒప్పుకున్నారు నిందితులు. పబ్‌లోనే బాలిక పట్ల అనుచితంగా వ్యవహరించిన కార్పొరేటర్‌ కుమారుడు.. పబ్‌ బయట కూడా మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు నిందితులు.


ఇక అమ్మాయి బెంజ్‌ కారు ఎక్కాకా మాత్రం ఎమ్మెల్యే కుమారుడే మొదట అసభ్యంగా ప్రవర్తించాడని.. అతని తరువాత కార్పొరేటర్‌ కొడుకు బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించాడని చెప్పారు. కాన్సూ బేకరీ దగ్గరికి వెళ్లేసరికి ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్‌ వెనుక సీట్లోకి మారి బాలికపై లైంగిక దాడి చేశాడని ఒప్పుకున్నారు. ఇక కాన్సూ బేకరీ దగ్గర బాలికను కార్లోనే కూర్చొబెట్టి అక్కడే అందరం ఫుడ్‌, సిగరెట్లు తాగమని.. ఆ తరువాత అందరం కలిసి ఇన్నోవా కారులో పబ్‌కి బయల్దేరామని.. బాలిక సెల్‌ఫోన్‌, కళ్లద్దాలను బలవంతంగా లాక్కుని అవి కావాలంటే ఇన్నోవాలో ఎక్కాలని బెదిరించామని. .దాంతో అమ్మాయి ఇన్నోవాలో ఎక్కిందని.. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిపై లైంగిక దాడి చేశామంటూ పోలీసుల విచారణలో సంచలన నిజాలని వెల్లడించారు నిందితులు.