జగన్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్..

 

బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు.. మోసాలకు అడ్డూ అదుపూ లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఏపీలో మద్యపానం నిషేధిస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ మద్యపాన ప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ. 8,300 కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని లోకేష్ అన్నారు.