నయనతార పై ప్రభుదేవా భార్య సంచలన వాఖ్యలు..

 


లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న నయనతార ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ ను వివాహం చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఈ విధంగా వివాహ జీవితంలో అడుగుపెట్టిన నయనతార పట్ల నయనతార మాజీ ప్రియుడు ప్రభుదేవా భార్య లతా గతంలో నయనతార పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. నయనతార విగ్నేష్ కన్నా ముందు ప్రభుదేవా ని ప్రేమించి ఆ ప్రేమను వివాహం వరకు తీసుకు వచ్చింది . కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల వీరిద్దరి వివాహం ఆగిపోయింది.


ప్రభుదేవా నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవా తన మొదటి భార్య లత కు విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ప్రభుదేవా-నయనతార విడిపోయారు. ఈ విధంగా ప్రభుదేవా నుంచి విడిపోయిన నయనతార విఘ్నేష్ ను చేసుకోవడంతో ప్రభుదేవా భార్య చేసిన కామెంట్ చాలా వైరల్ అవుతున్నాయి. నయనతార తన భర్తను ప్రేమిస్తున్నట్లు నటించి తన భర్త నుంచి తనని దూరం చేసిందని ఆమె ఆరోపిస్తోంది. 


ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నట్లు గా నటించి తన కాపురంలో చిచ్చు పెట్టింది అని, తన బతుకు రోడ్డున పడటానికి ముఖ్యకారణం నయనతారనే అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుదేవా తనను దేవతలా చూసుకునే వారని 15 సంవత్సరాల పాటు తన భర్త తో ఎంతో ఆనందం గా ఉన్న తన జీవితంలోకి నయనతార వచ్చి చిచ్చుపెట్టిందని.. తన మాయలో పడి తనకు విడాకులు ఇచ్చాడని లతా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఇంత బాధ పెట్టిన నయనతార ని ఏ దేవుడు కూడా క్షమించడు అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం లత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.