ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు క్లారిటీ..

 


ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్  బోర్డు కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా రిజల్స్ట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఫలితాల వెల్లడి వార్తలపై తామే సమాచారం అందిస్తామని, అప్పటి వరకు విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలని కోరారు. కాగా.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు  విడుదలవుతాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఈ వార్తలపై తెలంగాణ ఇంటర్ బోర్డు మంగళవారం క్లారిటీ ఇచ్చింది. సదరు వార్తలన్నీ వాస్తవం కాదని, విద్యార్ధులు వాటిని నమ్మవద్దని, ఫలితాలు విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో చేపట్టారు. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.