కోనసీమ లో అల్లర్లు వైసీపీ ప్లానే --: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

 


కోనసీమ లో అల్లర్లు వైసీపీ ప్లానే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌  మరోసారి స్పష్టం చేశారు. కోనసీమ అల్లర్లు బహుజన ఐక్యతపై దాడి అని ఆయన పేర్కొన్నారు.కోనసీమలో శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ జనసేన తీర్మానం తీసిందని ప్రకటించారు. కోనసీమ అల్లర్లను కులఘర్షణగా మార్చేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. కులరహిత సమాజం ఉండాలని అంబేద్కర్ (Ambedkar) కల అని తెలిపారు. కులాలు లేని సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ అన్నారని గుర్తుచేశారు. భారతదేశం కులాలతో ముడిపడి ఉందన్నారు. కుల విద్వేషణ చేసిన నేల ఇదని దుయ్యబట్టారు. మనకు ఆంధ్ర అనే భావన లేదని, కులం అనే భావనే ఉందని తప్పుబట్టారు. పక్క రాష్ట్రంలో కులం కంటే తెలంగాణ అనే భావనే ఉందని తెలిపారు.


అన్ని కులాలవాళ్లు ఓట్లు వేస్తేనే వైసీపీ (YCP) గెలిచిందన్నారు. ఆ సంగతి మర్చిపోయి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కోనసీమలో చిచ్చు అంబేద్కర్ పేరుతో వచ్చింది కాదని, అది వైసీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు అని ఆరోపించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉందని నిఘావర్గాలకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ కూడా రాష్ట్రాన్ని హెచ్చరించిందని పవన్‌ కల్యాణ్ తెలిపారు