దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు..

 


సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై సంగారెడ్డి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.సీ.ఝా ఫిర్యాదుతో ఎమ్మెల్యేతో పాటు యూనియన్‌ నాయకులు శ్రీశైలం, రాములు తదితరులపై కేసు పెట్టారు. గత నెల 19న కర్మాగారానికి వచ్చిన రఘునందన్‌రావు హెచ్‌.ఆర్‌ గోవింద్‌రావు, .జీఎం ఝాలను దూషించారు. వారిని గదిలో బంధించారు. గోవింద్‌రావుతో బలవంతంగా రాజీనామా చేయించి, ఆ లేఖను వాట్సా్‌పలో సంస్థ చైర్మన్‌కు పంపించి, ఆమోదించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. తమను దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఝా మే 28న ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.