‘టైగర్‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌లో రవితేజకు గాయాలు ..

 


మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో బిజిబిజీగా గడుపుతున్నాడు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీని కంప్లీట్ చేసిన రవితేజ.. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ భాగంగా రవితేజకు గాయాలు అయినట్లు తెలిసింది. ఓ పోరాట సన్నివేశంలో రవితేజ పాల్గొనగా.. ఆయన పట్టుకున్న తాడు జారిపోవడంతో కిందపడిపోయినట్లు సమాచారం. దీంతో మోకాలికి గాయాలు కాగా.. సుమారు 10 కుట్లు పడ్డాయి.


వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు సూచించినా.. తన వల్ల ఇతర నటులు, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వెంటనే షూటింగ్ స్పాట్‌కి వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదం కొద్ది రోజుల కింద చోటు చేసుకోగా.. గురువారం రవితేజ షూటింగ్‌ పాల్గొన్న సందర్భంగా వెలుగులోకి వచ్చింది. రవితేజ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

స్టూవర్ట్‌పురం గజదొంగ రియల్ లైఫ్ స్టోరీని డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వజ్ ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధంగా ఉంది. జవనరి నుంచి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. జూన్ 17న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. మళ్లీ పోస్ట్‌పోన్ అయింది. శ‌ర‌త్ మండ‌వ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.