సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి డే వన్ నుంచే సూపర్ డూపర్ హిట్టనే టాక్‌ను తెచ్చేసుకుంది. పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 200 క్రోర్ గ్రాస్‌ను కమాయించింది. ఇక ఇప్పటికీ అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలోనూ ఫోర్త్ గేర్‌లో రన్ అవుతోంది సర్కారు వారి పాట. అయితే ఈ రన్నింగ్‌లో మరింత జోష్ నింపాలనో.. లేక కలెక్షన్ రికార్డు గ్రాఫ్ ను పైకి పైకి తీసుకుపోవాలనో.. అదీ కాక ఫాన్స్ డిమాండ్‌ను నెరవేర్చాలనో తెలియదు కాని.. తాజాగా సర్కారు సినిమాకు “మురారి వా” అనే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను యాడ్ చేశారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ముఖ్యంగా కళావతి పాట సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా యాడ్ చేసిన మురారి వా పాటకూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సర్కారు వారి పాట స్క్రీన్ అవుతున్న ప్రతీ థియేటర్లో జూన్ 1నే యాడ్ చేసి.. ఫ్యాన్స్ లో నయా జోష్ నింపారు చిత్రయూనిట్. సినిమా ఎండ్ కార్డ్స్‌తో పాటు పాటను చూపించేసి.. అందర్నీ అరిపించేశారు. కాని ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో మాత్రం రిలీజ్ చేయకుండా అప్పుడు అట్టేపెట్టారు సర్కారి మేకర్స్. కాని తాజాగా ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో వదిలారు మహేష్ అండ్ టీం. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ మురారి వా సాంగ్ ను తాజాగా వైరల్ చేసే పనిలో పడ్డారు. రిపీటెడ్ మోడ్‌లో వింటూ.. పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు.