బద్రి కాంబో రిపీట్...?

 


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఓ వైపు పాలిటిక్స్ చేస్తూనే..మరో వైపున సినిమాలు చేస్తున్నారు. అలా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. జనసేనాని 'వకీల్ సాబ్' గా సినీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..వరుస సినిమాలు చేస్తున్నారు.

ఇటీవల 'భీమ్లానాయక్'గా ప్రజలను పలకరించారు.

ఈ సంగతులు పక్కనబెడితే..టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'బద్రి' చిత్రంతో పూరీ జగన్నాథ్ దర్శకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పూరీతో పవన్..'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఫిల్మ్ చేశారు.


 


ఈ క్రమంలోనే ముచ్చటగా మూడో సారి వీరి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ రావాలని ప్రేక్షకులు, పవన్ కల్యాణ్ అశేష అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఇటీవల పూరీ జగన్నాథ్ పవన్ కు..ఓ లైన్ చెప్పగా, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్.


 


ఇందులో పవన్ కల్యాణ్ ను సీఎంగా చూపించబోతున్నట్లు వినికిడి. ఇకపోతే ఈ పిక్చర్ ను కేవలం మూడు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానని పూరీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. చూడాలి మరి… ఈ వార్తల్లో నిజం ఎంతుందో..