ఓటిటి లోకి ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌: ఇన్‌ ద మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’

 


మార్వెల్ సంస్థ రూపొందించే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.


ఈ నిర్మాణ సంస్థలోనే రూపొందిన సూపర్ హీరో చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’. 2016లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌: ఇన్‌ ద మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’ తెరకెక్కింది. సామ్ రైమి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న విడుదలైంది. దాదాపు రూ.1500 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.6,800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.


తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డీస్నీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది. బెనడిక్ట్‌ కుంబర్‌ బ్యాచ్‌, ఎలిజబెత్‌ ఓల్సన్‌, జోచిటి గోమెజ్‌, వాండా మ్యాక్సిమాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్ కథ అందించాడు