మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

 


సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అనుహ్యమైన స్పందన వచ్చింది. ఇందులో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా… ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమాలో మురారి వా పాటను యాడ్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు.


సర్కారు వారి పాట సెకండాఫ్ లో మ మ మహేష అనే ఒకే ఒక్క పాట మాత్రమే ఉంటుంది. అయితే ఇంకో పాటను కూడా రెడీ చేశారు. కానీ దానిని సినిమాలో పెట్టలేదు. ఈ సాంగ్ విషయంపై సినిమా ప్రమోషన్లలో మహేష్ కూడా పెదవి విప్పాడు.. మురారి పాటను నేరుగా యూట్యూబ్ లో విడుదల చేస్తామన్నారు మహేష్ బాబు. కానీ.. తాజాగా ఈ సినిమా కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పాటను సినిమాలో యాడ్ చేశారట. ఇకపై థియేటర్లలో ఈ పాట ప్లే అవుతుందట. సినిమాలో మురారి పాట యాడ్ చేశామంటూ మేకర్లు ప్రకటించారు. మురారి వా పాటను చూడాలంటే ఇక ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లాల్సిందే. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జూన్ నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.