జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక ఆధారలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లలో ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది.
ఇన్నోవా కారులో నిందితుల వీర్య నమూనాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. రెండు కార్లలో బాలిక వెంట్రుకలను గుర్తించిన ఫోరెన్సిక్ బృందం.. నమూనాలను ఎఫ్ఎస్ఎల్కి పంపించింది. అలాగే ఫింగర్ ప్రింట్స్‌తో పాటు.. ఓ కారులో దొరికిన బాలిక కాలి చెప్పు.. చెవి రింగును క్లూస్ టీమ్ గుర్తించింది.
కార్లలో దొరికిన ఆధారాలను వేర్వేరు కవర్లలో క్లూస్ టీమ్ సీజ్ చేసింది. ఘటన జరిగిన ఐదు రోజులు తర్వాత పోలీసులు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలో నిందితులు వాహనం చిక్కకుండా మెయినాబాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్ వెనుక దాచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు టీఆర్ నెంబర్ కూడా గుర్తు పట్టకుండా చేసినట్టు తెలుస్తోంది.
పోలీసులు ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో మైనర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన కార్పోరేటర్ పాత్రపై ఆరా తీస్తున్నారు.
ఓ ఫామ్ హౌజ్ లో ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో బాధితురాలి వస్తువులు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం పలు సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించింది. ఫోన్ సిడిఆర్, సిసి పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో FSL రిపోర్ట్ కీలకంగా మారనుంది.
నిందుల కస్టడి కోరుతూ పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు. రేప్ కేస్ లో వీడియో లీక్ లపై అధికారుల సీరియస్ అవుతున్నారు. వీడియోలు సర్క్యూలేట్ చేస్తున్న సుభానీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేతలు వీడియో విడుదలపై పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు.