రాజమౌళి, మహేశ్ బాబు సినిమా లో హీరోయిన్ ఫిక్స్..?

 


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుబోతున్న పాన్ ఇండియా సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఫిక్సైన ప్రాజెక్ట్ కూడా ఒకటి. గత కొన్నేళ్ళుగా ఈ సినిమాకోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న  సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. 


ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్  సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్‌ను మళ్ళీ తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం తన దృష్ఠి మొత్తం మహేశ్ సినిమా మీదే పెట్టారు. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్నారట. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి బృందం ఉన్నట్టు తెలుస్తోంది. 


సాహో  సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాకపూర్‌. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్  హీరోగా నటించిన ఈ మూవీ ఒక్క బాలీవుడ్‌లో తప్ప మిగతా భాషలలో నిరాశపరిచింది. శ్రద్ధాకపూర్ హిందీలో మంచి క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కానీ, సాహో ప్రభావమా మరేదైనా కారణమా తెలీదు గానీ, మళ్ళీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. ఇలాంటి సమయంలో ఏకంగా మహేశ్ - రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే గొప్ప విషయమే. కాకపోతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలవబోతున్న సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇది పూర్తయ్యాక రాజమౌళి సినిమా ఉంటుంది.