సరికొత్త ప్రపంచాన్నే కనుగొన్న శాస్త్రవేత్తలు.రొయ్యల మాదిరిగా ఉన్న జీవులు

 


శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం కనుక్కునేందుకు తాపత్రయపడుతుంటారు. కానీ ఒక్కోసారి వారు ఒకటి అనుకుంటే మరేదో అవుతుంది.అలాంటి ఘటన తాజాగా అంటార్కిటిక్‌లో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని కనుగొనేందుకు వెళ్లిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రపంచాన్నే కనుగొన్నారు. ఇది మంచు అడుగున దాదాపు 500 మీటర్ల లోతులో ఉంది. ఈ పరిశోధనను న్యూజిల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేశారు. ఈస్ట్యూరీలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని పరీక్షిస్తున్న వీరు మంచును డ్రిల్ చేసుకుంటూ వెళ్లారు. ఆ సమయంలోనే వారికి సరికొత్త ప్రపంచం కంటపడింది. దాంతో అక్కడ ఏం ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు వారు కెమెరాను పంపించడం జరిగింది. అప్పుడు వారు అక్కడ రొయ్యల మాదిరిగా ఉన్న జీవులను గుర్తించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆ జీవుల్లో కొన్నింటిని వారు పట్టుకున్నారు. వాటిపై మరిన్ని పరిశోధనలు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.