మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ...

 


టీం ఇండియా స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. కోహ్లీ తన బ్యాటింగ్ ఫామ్కొనసాగించకపోయిన కూడా అతనికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గనే తగ్గదు.


దీనికి నిదర్శనమే అతను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్ గా కొనసాగుతున్నారు. తాజాగా విరాట్ ఇన్ స్టాగ్రామ్ లో 200 మిలియన్ల మార్క్ ను అధిగమించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. అలాగే 200 మిలియన్ మార్క్ ను అందుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా కూడా కోహ్లీ తన పేరును నమోదు చేసుకున్నాడు.


ఈ రికార్డ్ బ్రేక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కు చేరుకున్న కోహ్లీ అభిమానుల కోసం ఓ ప్రత్యేక పోస్ట్ ను పెట్టాడు. తనను ఇంతలా ఆదరిస్తున్న తన అభిమానులందరికి కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. విరాట్ కోహ్లీ ఒక్క ఇన్ స్టా లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న అన్ని సోషల్ మీడియాలో ముందు స్థానంలో ఉంటాడు. కోహ్లీకి ఫేస్ బుక్ లో 49 మిలియన్లు, ట్విట్టర్ లో 49 మిలియన్ల కంటే ఎక్కవు మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న అథ్లెట్లు క్రిస్టియానో​రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాత కోహ్లీ మాత్రమే ఉన్నాడు.