సల్మాన్ ఖాన్ తో చెర్రీ సినిమా..?

 ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి చెందిన నటీనటులు కూడా ప్రాంతీయ భాషా చిత్రాలలో నటిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు.ఇక అంతే కాదు హిందీ చిత్రాల్లో కూడా మన తెలుగు హీరోలు నటిస్తూ సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం లో రామ్ చరణ్ అదిరిపోయే కెమియో లో నటించబోతున్నట్లు ఒక వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఇక రామ్ చరణ్ ఈ ఏడాది రౌద్రం రణం రుధిరం సినిమాతో ప్రేక్షకులను పలకరించి..ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆ తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి ప్రేక్షకులను పలకరించినా.. మెగా అభిమానులను మాత్రం ఈ సినిమా నిరాశపరిచింది అని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ,శంకర్ తో పాటు పలువురు దర్శకులతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. ఇక ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి రామ్ చరణ్ ఓకే చెప్పినట్లు సమాచారం. 


సల్మాన్ ఖాన్ కూడా తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్ర షూటింగ్ కూడా పూర్తయింది.ఈ సినిమా ను మలయాళం తప్ప మిగిలిన తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండడంతో.. రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దీవాలీ సినిమాలో కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ కథలో ముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.