తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 


తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ భవన్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి భారత ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదవారికి రూ.3 చొప్పున ఐదు కిలోల బియ్యం, కరోనా నేపథ్యంలో మరో ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు.