తగ్గిన వంట నూనె ధరలు ...

 


వంట నూనెలలు సామాన్యులకు ఊరటనివ్వనున్నాయి. ఇప్పటికే పరుగులు పెట్టిన వంటనూనె ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక తాజాగా దేశంలో వంటనూనె ధరలు మరింత తగ్గనున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో.. దేశీయంగా ఈ వంట నూనెల ధరలు లీటరు రూ.15 వరకు దిగొచ్చాయి. పామాయిల్ ధర లీటరు రూ.7 నుంచి రూ.8 వరకు తగ్గింది. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు లీటరుపై రూ.10 నుంచి రూ.15 తగ్గినట్టు మీడియా రిపోర్టులలో తెలిసింది. సోయాబీన్ ఆయిల్ ధరలు లీటరుపై రూ.5 తగ్గినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.


హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ తన లీటరు ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై గత వారం రూ.15 మేర ధర తగ్గించింది. దీంతో ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ ధర రూ.220గా ఉంది. ఈ వారం కూడా మరో రూ.20 మేర ధరను తగ్గించింది. దీంతో లీటరు ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధర రూ.200కు దిగొచ్చింది.