అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని మోడీ కోరిన రాహుల్ గాంధీ..

 


దేశ ప్రజలకు ఏం కావాలన్న విషయం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తన స్నేహితులు చెప్పే మాటలనే మోదీ వింటారని, ఇతరు మాటలు వినరని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో త్రివిధ దళాల్లో నియామకాలకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల సర్వీసు మాత్రమే ఉండడంతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ పథకం వల్ల నష్టోతామని చెబుతున్నారు.


ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అగ్నిపథ్ పథకంపై స్పందించారు. అగ్నిపథ్ పథకాన్ని యువకులు తిరస్కరించారని, అలాగే, వ్యవసాయ చట్టాలను రైతులు, పెద్ద నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను వ్యాపారులు తిరస్కరించారని ఆయన అన్నారు. అగ్నిపథ్‌పై ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో 24 గంటల్లోనూ అగ్నిపథ్ నిబంధనలను కేంద్ర సర్కారు మార్చాల్సి వచ్చిందని అన్నారు.’ నరేంద్ర మోదీజీ దయచేసి ఈ పథకాన్ని ఉపసంహరించుకోండి’ అని ట్వీట్ చేశారు. వయోపరిమితి పెంచుతూ, ఇంతకు ముందు ఉన్న పద్ధతిలో ఆర్మీలో నియామకాలు చేపట్టాలని అన్నారు.