ఏరువాక పౌర్ణమి నాడు రైతన్నకు సన్మానం.

 


ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని మన సమాజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం ఆరూరు గ్రామం ఒక వ్యవసాయ క్షేత్రంలో రైతన్నలను సన్మానించినట్లు మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జంగం మహేష్ స్వామి, మన సమాజం ఫౌండేషన్ సంగారెడ్డి నిర్వాహకులు వెన్న చక్రేశ్వర్ అన్నారు.

భారతీయ సనాతన ధర్మంలో రైతన్నలకు మొట్ట మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ ఏరువాక పౌర్ణమి.

ఈ పండుగ తోనే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.


తను పండించేటటువంటి గింజపై తన పేరు రాసుకొనటువంటి త్యాగశీలి రైతు.


 అలాంటి రైతును ఏరువాక పౌర్ణమి రోజున వారిని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మన సమాజం ఫౌండేషన్ సహ కార్యదర్శి రవికుమార్ గౌడ్, కోశాధికారి సంతోష్ స్వామి, ముఖ్య కార్యనిర్వాహకులు హరీష్ , యాదగిరి, విజయ్ స్వామి, రైతన్నలు పాల్గొన్నారు.