అగ్నిపథ్ నోటిఫికేషన్‌ విడుదల...

 


అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్‌ను భారత సైన్యం  విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ను ఆర్మీ విడుదల చేసింది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అగ్నివీరులకిచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, నిబంధనల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది.


న్యూ రిక్రూట్‌మెంట్ స్కీమ్ తొలి రౌండ్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండియన్ ఆర్మీలో డిస్ట్కింక్ట్ ర్యాంక్‌గా అగ్నివీర్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతమున్న ఇతర ర్యాంకులకు ఇది భిన్నమని పేర్కొంది. భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూన్ 21న వెలువడుతుందని, వైమానికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు కొత్త మోడల్ కింద రిక్రూట్‌మెంట్ వెబ్‌‍సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని ఆర్మీ తెలిపింది. జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పింది.