ముగిసిన రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ గడువు ..

 


రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసింది.ఇప్పటి వరకు ఈ రెండు స్థానాలకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డి.దామోదర్‌రావు, బి.పార్థసారథిరెడ్డి నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన, ఈ నెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి అభ్యర్థిత్వం ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక వారి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.