మాటల మాంత్రికుడితో మెగాస్టార్..?

 


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది.అయితే అన్ని విధాలుగా ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో అప్ కమింగ్ సినిమా లపై మెగాస్టార్ జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది.


అదేమిటంటే ఆచార్య రిజల్ట్‌తో కాస్త కేర్ తీసుకుంటున్న మెగాస్టార్.. ఇప్పటికే ఓకే చెప్పిన ఓ యంగ్ డైరెక్టర్ స్థానంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చినట్లు రూమర్లు వస్తున్నాయి. వరుసగా సీరియస్ రోల్స్ చేస్తున్న చిరు.. కాస్తా ఛేంజ్ ఓవర్ కోసం త్రివిక్రమ్‌తో పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. గతంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో చిరు చెప్పిన పంచ్ డైలాగ్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.


ఆ తరువాత చిరంజీవి,త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసినప్పటికీ సెట్ అవ్వలేదు. కానీ గతంలోనే మెగాస్టార్‌తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ ఆ సినిమా తరువాత పట్టాలెక్కలేదు. ప్రస్తుతం మహేస్ బాబుతో ఓ సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. ఆ తరువాత ఇంకా ఎవరికీ ఓకే చెప్పలేదు. ఇటు చిరంజీవి హీరోగా.. బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా,వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇటీవల ప్రచారం జరిగింది.