దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..

 


దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు పౌర విమానయాన శాఖ సీఐఎస్ఎఫ్‌కు మార్గదర్శకాలను పంపింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని తెలిపింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కొవిడ్ భద్రతా చర్యలను పాటించేందుకు నిరాకరించే విమాన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.