వరల్డ్ లోనే నంబర్ గా ఆర్. ఆర్.ఆర్ సినిమా..

 


దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో చేసిన మాస్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే.


భారీ వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇపుడు 70 రోజులకి చేరుకుంది.


మరో 50 రోజుల తర్వాత ఓటిటి లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం థియేటర్స్ లో మించి ప్రపంచ స్థాయిలో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ఈ చిత్రం హిందీలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా సౌత్ ఇండియా భాషల్లో జీ 5 లో విడుదల అయ్యింది.


అయితే ఈ చిత్రం ఇప్పుడు జీ 5 లో మాత్రం ఇంకా దుమ్ము లేపే రెస్పాన్స్ తోనే కొనసాగుతుందట. గత మూడు వారాల కితం వరల్డ్ వైడ్ నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఇదే ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ నిలిచిందట. దీని బట్టి ఓటిటి లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయ్యిందని చెప్పాలి.


ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటించింది. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య సుమారు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు