వైఎస్‌ వివేకా మర్డర్‌ కేస్‌లో మళ్లీ కొత్త ట్విస్ట్...

 


వైఎస్‌ వివేకా మర్డర్‌ కేస్‌ మళ్లీ మొదటికొచ్చింది. దస్తగిరి, ఇనయతుల్లా ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మరోసారి దర్యాప్తు చేస్తోంది సీబీఐ టీమ్‌. వివేకా ఇంటితోపాటు నిందితుల ఇళ్ల కొలతలు తీసుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైఎస్‌ వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కొద్దిరోజులుగా పులివెందులలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. పులివెందుల మొత్తం కలియదిరుగుతూ ఎంక్వైరీ చేస్తున్నారు. వైఎస్‌ వివేకా ఇంటితోపాటు నిందితుల ఇళ్లను పదేపదే పరిశీలిస్తున్నారు. వైఎస్ వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనయతుల్లాతోపాటు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో చర్చించారు. ఆ తర్వాత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్‌, వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి ఇల్లు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్ల ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్‌ వివేకా మర్డర్‌ జరిగిన తీరుపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్‌ చేశారు. అలాగే, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఫొటోలు కూడా తీసుకున్నారు సీబీఐ అధికారులు