అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలి --: రాహుల్ గాంధీ..

 


రైతుల నిరంతర నిరసనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్ననేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పుడు గత ఏడాది రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీని.. దేశంలోని యువతకు క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని అన్నారు. వరుసగా 8 సంవత్సరాలు, బిజెపి ప్రభుత్వం జై జవాన్, జై కిసాన్ విలువలను అవమానించిందన్నారు. నల్ల వ్యవసాయ చట్టాన్ని ప్రధాని ఉపసంహరించుకోవాలని గతంలో కూడా నేను చెప్పానని అన్నారు. ఇప్పుడు అగ్నిపథ్ ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.