వారణాసి వరుస బాంబు పేలుడు కేసు లో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లా ఖాన్‌ మరణశిక్ష విధించిన కోర్టు..

 


వారణాసి వరుస బాంబు పేలుడు కేసు (2006)లో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లా ఖాన్‌ కు ఘజియాబాద్‌ జిల్లా సెషన్‌ కోర్టు సోమవారం  మరణశిక్ష విధించింది. బాంబు పేలుళ్ల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌కు చెందిన మహమ్మద్‌ వలీలుల్లా ఖాన్‌ ను పోలీసులు 2006 ఏప్రిల్‌ 6న లక్నోలో అరెస్టు చేశారు. ఈ కేసును వారణాసి న్యాయవాదులు వాదించడానికి నిరాకరించడంతో కేసు విచారణను ఘజియాబాద్‌ కోర్టుకు అప్పగించారు. జూన్ 4న విచారణ జరిపిన ఘజియాబాద్ కోర్టు ఉగ్రవాది వలీలుల్లాను దోషిగా నిర్ధారించింది. ఎట్టకేలకు ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన వలీలుల్లా ఖాన్కు అంతిమ శికను విధిస్తూ ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది.