ఏపీ లో పదోవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసేపటి క్రితమే పదోవ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తాజాగా తెలియజేసిన విషయం తెలిసిందే.



చెప్పిన విధంగానే మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌లో ఉన్న గేట్వే హోటల్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.inలో రిజల్ట్స్ చూసుకోవాలని అధికారులు తెలిపారు.


ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి పరీక్షలకు 6,22,537 మంది హాజరై, పరీక్షలను రాశారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు అధికారులు విధులను కేటాయించారు. నేడు పరీక్ష ఫలితాలను వెల్లడించారు.