పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల దినోత్సవం వేడుకలు..
  •  తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం-తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్


సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ  అమరవీరుల త్యాగఫలితానికి మారుపేరే తెలంగాణ రాష్ట్రమని  మరియు అమరులైన అమరవీరుల కుటుంబాల యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని, అమరులైన కుటుంబాలను రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకుంటున్నారే తప్పా అమరులైన కుటుంబాలను పట్టించుకునే నాథుడే టీఆర్ఎస్ పార్టీలో లేడని తెలియజేశారు.మరియు  విద్యా సంఘాల, ఉద్యమకారుల, ప్రజాపోరాట యోధుల సంఘాల నాయకులు  మన హక్కుల సాధనకై పోరాటంలో భాగంగా   బలిదానాలు ఆపి మనము సాధించాలనుకున్న ప్రగతి చేరేవరకు ఉక్కుమ్మడిగా చేరి   అలుపెరగని పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. తదనంతరం పట్టభద్రుల సంఘం అధ్యక్షులు విశాల్ మాట్లాడుతూ అమర వీరులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని పోరాడే తత్వం గల నాయకులను ప్రజాస్వామ్య చట్ట సభలోకి తీసుకువస్తే  ప్రజలు  కలలుగన్న తెలంగాణ సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ యొక్క  కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు, కార్యనిర్వాహక సభ్యుడు పరమేష్ గారు,జిల్లా బిసి సంఘం నాయకులు గొల్లగూడెం శంకర్ గౌడ్ గారు   మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.