మైనర్ లైంగిక దాడి ఘటనలో బాలిక మనోభావాలు దెబ్బతినేలా ఫోటోలు బహిర్గతం చేయడానికి ఖండిస్తూ అడ్వకేట్ కరమ్ కొమిరెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు. కాగా ఇదే విషయంపై డీజీకి రఘునందన్‌రావు కూడా ఫిర్యాదు చేశారు.