రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశాలు..

 

కాంగ్రెస్ పార్టీ రేపు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపిన విషయం తెలిసిందే.