చరణ్, లోకేష్ సినిమా పై క్లారిటీ...

 


ఖైదీ, విక్రమ్ సినిమాలతో తమిళ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించాడు లోకేశ్ కనగరాజ్  కమల్ హాసన్  లాంటి యూనివర్సల్ యాక్టర్ తో సినిమా చేసి బాక్సాపీస్ ను షేక్ చేస్తూ..స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు.ఇటీవలే కమల్ హాసన్ అండ్ టీంను మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన విషయం తెలిసిందే. లోకేశ్‌కనగరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు.


కాగా లోకేశ్ కనగరాజ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో సీక్రెట్‌గా సమావేశమయ్యాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రీసెంట్‌గా వచ్చిన ఆర్ఆర్ఆర్‌లో రాంచరణ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడట లోకేశ్‌. ఈ నేపథ్యంలోనే విక్రమ్ సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ రాంచరణ్‌తో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రహస్యంగా సమావేశయ్యాడని ఓ న్యూస్ ఫిలింనగర్‌లో హల్ చల్ చేస్తోంది. రాంచరణ్‌తో త్వరలోనే ఓ సినిమాకు సన్నాహాలు చేయబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది.


2023లో లోకేశ్‌కనగరాజ్‌-రాంచరణ్ కాంబోలో సినిమా ఉండే అవకాశాలున్నాయని గాసిప్స్ తెరపైకి రాగా..దీనిపై రాంచరణ్ నుంచి కానీ, లోకేశ్ నుంచి కానీ ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ఆర్‌సీ 15 ప్రాజెక్టు చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉంది.