రామ్ చరణ్ కమలహాసన్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా

 

ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగుతున్న నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న హీరోల సంఖ్య పెరుగుతోంది. వేర్వేరు హీరోలు ఒకే ప్రాజెక్ట్ లో కలిసి నటించడం వల్ల సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. నిర్మాతలకు కూడా మల్టీస్టారర్ సినిమాలు మంచి లాభాలను అందిస్తున్నాయి. చరణ్ ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారనే సంగతి తెలిసిందే. అయితే చరణ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. 

అయితే ఈ కాంబినేషన్ కు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. మరో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైందని తెలిసి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. చరణ్, కమల్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ పాజెక్ట్ లు పూర్తైతే ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది. వేర్వేరు భాషలకు చెందిన స్టార్ హీరోలు ఈ విధంగా సినిమాలు చేయడం వల్ల రెండు భాషల సినీ ఇండస్ట్రీలకు మేలు జరుగుతుంది.
 ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన చరణ్ కు ఆచార్య సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నారు. విక్రమ్ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. విక్రమ్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. కమల్ హాసన్ చాలా కాలం తర్వాత సక్సెస్ సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 

కమల్ విక్రమ్ సక్సెస్ తో తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. విక్రమ్ విజయంతో కమల్ హాసన్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు కమల్ కు క్రేజ్ పెరుగుతోంది.