కేంద్రం 'అగ్నిపథ్' స్కీంను విరమించుకోకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రధాని మోడీ అవగాహన లోపం, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల అగ్నిపథ్‌ను తీసుకువచ్చారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామని చెప్పారు. ఆందోళనలో గాయపడ్డ విద్యార్థులను పరీక్షలకు అనర్హులుగా ప్రకటించకుండా అనుమతి ఇవ్వాలని, నాన్ బెయిలబుల్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అల్లర్లలో చనిపోయిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.