'బ్రహ్మాస్త్రం' సినిమా నుండి నాగార్జున లుక్ విడుదల..

 


ఆయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మాస్త్రం' ఆలియాభట్‌  రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటిస్తున్నారు.


అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రధారులు. ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం 'బ్రహ్మాస్త్రం: శివ' పేరుతో తెలుగులో విడుదల కానుంది. అక్కినేని నాగార్జున పాత్రను రివీల్‌ చేస్తు నిర్మాణ సంస్ఘ కొత్త పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది. 'నంది అస్త్ర' అనే శక్తి గల అనీశ్‌ పాత్రలో నాగార్జున నటించారు. ఎస్‌.ఎస్‌ రాజమౌళి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 15న, సెప్టెంబర్‌ 9న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. '' నాగార్జున తన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. ''ఈ చిత్రంలో నన్నూ భాగం చేసిన అయాన్‌కు కృతజ్ఞతలు'' అని నాగార్జున పేర్కొన్నారు