ఏపీ లో టెట్ నోటిఫికేషన్ విడుదల..

 


ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌ కుమార్ అమరావతి నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేసి వివరాలు ప్రకటించారు.

బీఈడీ, టీటీసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ టెట్ రాసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న తెలుగువారు కూడా టెట్ రాయడానికి అవకాశం కల్పించారు.

ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం అది చెల్లుబాటు అవుతుంది. టెట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఫీజు కట్టే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ (పేపర్ల వారీగా) నిర్వహిస్తారు. ఆగస్టు 31న కీ విడుదల చేస్తారు. సెప్టెంబరు 14వ తేదీన ఫలితాలు విడుదల అవుతాయి. పూర్తి వివరాలకు aptet.apcfss.in చూడొచ్చు.