నేడే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు...

 


ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు.

మే 6వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం, మే7వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించిన విషయం విధితమే. మే 24న పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విడులయ్యే ఇంటర్ ఫలితాలను www.bie.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు. లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు చెక్ చేసుకోవచ్చు. .