ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సలార్ సినిమా నుండి టీజర్ అప్డేట్...?

 


కేజిఎఫ్ సినిమాని తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. హై ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మే చివరి వారం లోనే టీజర్ రావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్ణీత సమయానికి రాలేకపోయింది. తాజాగా ఈ చిత్రం టీజర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

జూలై రెండవ వారంలో టీజర్ విడుదల కాబోతుందని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. యాక్షన్ సీన్లలోనీ కొన్ని షాట్స్ ను ఈ టీజర్లో చూపించబోతున్న ట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాకాలు చేస్తున్నారు.