'అసురుడు' అనే టైటిల్‌తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా..?

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్  కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇటీవలే ప్రకటించారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 31 వ చిత్రం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. 'ఆర్ఆర్అర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తారక్.. ఒకేసారి తన 30, 31వ చిత్రాల అప్‌డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.


జస్ట్ పోస్టర్స్‌తోనే ఈ రెండు చిత్రాలపైన భారీగా అంచనాలు పెంచారు. ఎన్టీఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే, తాజాగా ఎన్టీఆర్ 31 నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాకి మేకర్స్ 'అసుర' లేదా 'అసురుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. 'అసుర' టైటిల్‌లోనే ఒక పవర్ ఉంది, అలాంటిది ఎన్టీఆర్ సినిమాకి ఆ పేరు పెట్టాలనుకుంటున్నారూ అంటే సినిమా ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉంటుందో.. అని అభిమానులు చెప్పుకుంటున్నారు. 


ఎన్టీఆర్ 31 గురించి గతంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ... 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఆలోచనే ఈ కథ, బడ్జట్ పరిమితుల కారణంగా ఆ ఆలోచన పక్కన పెట్టేశాను..అని చెప్పాడు. ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన ప్రశాంత్ నీల్, తన అభిమాన హీరోని... తన డ్రీమ్ ప్రాజెక్ట్ కథలో ఎలా చూపించబోతున్నాడు.. ఎన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడు.. అనేది చూడాలి. ఇక ప్రశాంత్ నీల్ రూపొందిన కేజీఎఫ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్ళను రాబట్టాయి. దాంతో ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్', తారక్‌తో చేయనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.