మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రఘనందనరావు

 


తెలంగాణ రాజధాని నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది. శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు  ఈ ఫొటోలను రిలీజ్ చేశారు.


అయితే.. ఈ ప్రెస్‌మీట్ తర్వాత ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు హుటాహుటిన సమావేశమయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఈ వీడియోలు ఎలా చేరాయనే దానిపై కూడా అధికారులు లోతుగా చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఉన్నతాధికారులు మీడియా మీట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి